శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (08:28 IST)

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్‌....

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, వామపక్షాలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. 
 
రుణమాఫీకి ఏకమొత్తంలో నిధులు విడుదల చేయాలని, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. బంద్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఆయా బస్‌డిపోల వద్ద అఖిలపక్ష నాయకులు బస్సులను అడ్డుకున్నారు. 
 
ఆదిలాబాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విపక్షాల బంద్‌కు మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ నేతల అరెస్టు హైదరాబాద్‌ నగరంలో ధర్నాకు దిగిన పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌ రెడ్డి కార్యకర్తలను పోలీసులను అరెస్టు చేశారు.