శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (16:14 IST)

రైలు ప్రమాద బాధితులంతా సీఎం కేసీఆర్ నియోజకవర్గవాసులే!

మాసాయిపేట - శ్రీనివాస్‌నగర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ప్యాసింజర్‌ స్కూల్‌ బస్సును ఢీ కొన్న ప్రమాదంలో బాధితులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గవాసులే కావడం గమనార్హం. మృ తులు, క్షతగాత్రులు తూప్రాన్‌, వర్గల్‌ మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదం సంఘటనా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో జరిగింది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మృతి చెందిన విద్యార్థులు వీరే... 
నాందేడ్‌ నుంచి కాచిగూడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు మాసాయిపేట-శ్రీనివాస్‌నగర్‌ క్రాసింగ్‌ వద్ద ఢీకొట్టడంతో తూప్రాన్‌కు చెందిన కాకతీయ స్కూల్‌ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జుయింది. ఇందులో గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన తూప్రాన్‌ మండలంలోని కిష్టాపూర్‌, ఇస్లాంపూర్‌, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, దాతర్‌పల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో కిష్టాపూర్‌కు చెందిన గౌసియా, అబ్దుల్‌ రషీద్‌, విశాల్‌, ధనుష్‌గౌడ్‌, ఇస్లాంపూర్‌కు చెందిన భువన, వంశీ, విష్ణు, వెంకటాయపల్లికి చెందిన శృతి, నట్టలపల్లి వంశీ, గుండ్రెడ్డిపల్లికి చెందిన మనీష్‌యాదవ్‌, సుమన్‌, శ్రీవిద్య, దివ్య, చరణ్‌తోపాటు బస్సు డ్రైవర్‌ నాచారానికి చెందిన భిక్షపతి, క్లీనర్‌ ఘణపూర్‌కు చెందిన రాములు మృతుల్లో ఉన్నారు. 
 
క్షతగాత్రుల్లో రుచితాగౌడ్‌, శరత్‌, వరుణ్‌గౌడ్‌, నబీరాఫాతిమా, శ్రావణి, శిరీష, వైష్ణవి, దర్శన్‌, ప్రశాంత్‌, నితీష, తరుణ్‌ పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. సాయిరాం, సందీప్‌, సాత్విక, హరీశ్‌, మహిపాల్‌రెడ్డి, అభినందు, సద్బావనదాస్‌, కరుణాకర్‌, శివకుమార్‌లకు ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొ న్నారు. వీరంతా హైదరాబాద్‌ శివారులోని కొంపల్లి ఆర్‌ఆర్‌, బాలాజీ, అపోలో, యశోద ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.