శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (10:43 IST)

సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్‌ ఛైర్మన్‌గా కేసీఆర్

దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే సదరన్ జోనల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపికయ్యారు. ఆయనను ఈ పదవికి ఎంపిక చేస్తూ కేంద్ర హోంమంత్రి నుంచి అధికారికంగా లేఖ అందింది. సదరన్ జోనల్ కౌన్సిల్‌కి కేంద్ర హోంమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీని ఉపాధ్యక్ష పదవిలో కేసీఆర్ ఒక సంవత్సరం పాటు వుంటారు. 
 
గతంలో దక్షిణాది నుంచి జోనల్ వైస్ ఛైర్మన్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నారు. ఈ దఫా ఈ అవకాశం కేసీఆర్‌కు దక్కడం గమనార్హం. ఈ సదరన్ కౌన్సిల్‌లో తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తెలంగాణ సదరన్ జోనల్ కౌన్సిల్‌లో సభ్యులుగా వుంటాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, జాతీయ సమగ్రత, కేంద్ర పథకాల అమలు, అభివృద్ధిపై రాష్ట్రాల ఆలోచనలను కేంద్రానికి తెలియజేయడం వంటి అంశాలు కౌన్సిల్ పరిధిలో చర్చిస్తారు.