గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: సోమవారం, 24 అక్టోబరు 2016 (19:09 IST)

చంద్ర‌బాబు ఓకే అన్నారు... ఏపీ అసెంబ్లీ మాకిచ్చేయండి : గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్: ఒక‌ప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు... తెలంగాణా సీఎం కేసీఆర్, త‌ర‌చూ కీచులాడుకునేవారు. ఏపీ ఆస్తులు, తెలంగాణా గ‌డ్డ అంటూ సీరియ‌స్‌గా వాదులాడేవారు. కానీ, ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంచెం వెన‌క్కి త‌గ్గారు. ప‌దేళ్ల హ‌క్కున్నా.. ఏ

హైద‌రాబాద్: ఒక‌ప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు... తెలంగాణా సీఎం కేసీఆర్, త‌ర‌చూ కీచులాడుకునేవారు. ఏపీ ఆస్తులు, తెలంగాణా గ‌డ్డ అంటూ సీరియ‌స్‌గా వాదులాడేవారు. కానీ, ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంచెం వెన‌క్కి త‌గ్గారు. ప‌దేళ్ల హ‌క్కున్నా.. ఏపీ కార్యాల‌యాల‌న్నింటినీ విజ‌య‌వాడ‌కు త‌ర‌లించేయ‌డమే కాకుండా... తాను కూడా విజ‌య‌వాడ‌కు వ‌చ్చేశారు. ఇక ఇపుడు మున‌ుప‌టి ప‌ట్టుద‌ల‌, ఆగ్ర‌హం, ఆవేశాలు లేవు. తెలంగాణాతో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఇపుడు అవ‌సరం... అంటూ చంద్ర‌బాబు తాజాగా వెన‌క్కి త‌గ్గిమ‌రీ కామెంట్స్ చేశారు. 
 
హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న అసెంబ్లీని తెలంగాణాకు పూర్తిగా ఇచ్చేద్దాం... అని చంద్ర‌బాబు త‌న ఉదార‌త‌ను ప్ర‌క‌టించారు. దీనితో కేసీఆర్ ఇక ఆగుతారా... వెంట‌నే ఏపీ, తెలంగాణా ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ని క‌లుసుకున్నారు. చంద్ర‌బాబు నుంచి అంతా లైన్ క్లియ‌ర్. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. 
 
రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పరిపాలనా భవనాలను అప్పగించాలని కోరుతూ తెలంగాణ మంత్రిమండలి ఇటీవల తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రతిని గవర్నర్‌కు కేసీఆర్‌ అందజేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలిపారు. వీలైనంత త్వరగా తమకు భవనాలు అప్పగించేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.