శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (12:08 IST)

సమగ్ర సర్వే సూపర్‌ డూపర్ హిట్.... కేసీఆర్ సంతోషం

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ డూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇలాంటి సర్వే ఎవ్వరూ చేయలేదని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయనీ, కేంద్ర ప్రభుత్వం సైతం మా సర్వే మార్గాన్ని అనుసరిస్తుందని జోస్యం చెప్పారు. సమగ్ర సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
 
తాజా సర్వే కారణంగా హైదరాబాదులో కోటీ 20 లక్షల మందికిపైగా ప్రజలు ఉన్నట్టు తెలిసిందని వెల్లడించారు. సర్వే ద్వారా చాలా విషయాలు తెలిశాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాగే సహకరిస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
రానున్న కొద్ది రోజుల్లో ఎక్కడ చూసినా వివరాలు ఉంటాయని, అర్హులకు లబ్ది చేకూరుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సర్వేకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పైసా ప్రతిఫలం ఆశించకుండా పని చేసిన ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
 
ముస్లిం యువతులుకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 51 వేల రూపాయలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఆ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్లిపోతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.