Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టాలీవుడ్ 'డ్రగ్' సెలబ్రిటీలకు గ్రేట్ రిలీఫ్... వాళ్లు బాధితులేనన్న కేసీఆర్

శుక్రవారం, 28 జులై 2017 (19:23 IST)

Widgets Magazine
KCR

ఇప్పటివరకూ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన టాలీవుడ్ నటీనటులు డ్రగ్స్ కేసుల్లో అరెస్టు అవుతామేమోనన్న ఆందోళలో వున్నట్లు తెలిసిందే. ఐతే వాళ్లందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రిలీఫ్ ఇచ్చే మాట చెప్పారు. నోటీసులు అందుకున్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు బాధితులే తప్ప నేరస్తులు కారని స్పష్టీకరించారు. డ్రగ్స్ వాడటాన్ని తాము నేరంగా పరిగణించడం లేదనీ, డ్రగ్స్ అమ్మకందార్లు, సరఫరా చేసేవారు, ఇతరులకు అలవాటు చేస్తున్నవారిపై ఖచ్చితంగా కఠిన చర్యలుంటాయన్నారు. 
 
ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను లక్ష్యం చేసుకున్నామన్న ఆరోపణల్లోవాస్తవం లేదని చెప్పిన ఆయన డ్రగ్స్ తీసుకోవడం నేరం కాదన్నారు. దేశంలోనే తెలంగాణ డ్రగ్స్ విషయంలో అగ్రస్థానంలో వున్నదన్న మాటలో నిజం లేదనీ, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో చెప్పుకునే స్థాయిలో కూడా లేదన్నారు. 
 
ఇప్పుడిప్పుడే ఇక్కడ డ్రగ్స్ దందా వెలుగుచూడటంతో దానిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలియజేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సీఐడికి అప్పగించాలన్న యోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి రెండో జాబితా రెడీ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎవరి పేర్లు వుంటాయన్న ఆసక్తి నెలకొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మాకు ఒంగోలు జాతి గిత్తలు కావాలి... స్పీకర్ కోడెలను కలిసిన బ్రెజిల్ వ్యాపారులు

అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన ...

news

చుక్కేసింది.. కారు నడిపింది.. అడ్డుకున్న పోలీసుకు ముద్దులిచ్చేసింది..

అసలే మందు తాగింది. ఆపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. ఇక ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతే తనను ...

news

టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ ఏం చేశారో తెలుసా...?

పదవులను అనుభవించిన తరువాత పార్టీకి ముఖం చాటేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది చాలామంది టిడిపి ...

news

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమా...? ఎలా?

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రాజకీయ ...

Widgets Magazine