బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (11:21 IST)

తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో 70 శాతం ఉద్యోగాలు మనకే : కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానంలో 70 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే కల్పించేలా నిబంధన పొందుపరుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పాలసీని తెలంగాణ రాష్ట్రం తీసుకురాబోతోందన్నారు. 
 
తమ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలంతా ప్రశంసిస్తున్నారని అన్నారు. తెలంగాణ విధానాలన్నీ పారదర్శకంగా ఉంటాయన్నారు. సింగిల్ విండో విధానంలో జీరో కరప్షన్ ద్వారా పరిశ్రమలకు అనుమతులను ఇస్తామన్నారు. పెట్టుబడిదారులంతా నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చి అనుమతులు పొందవచ్చని అన్నారు. 
 
ఏంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నిలబెట్టవలసిన బాధ్యత తమపై ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు కొనసాగుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని అయన అన్నారు. తాను దేనికీ భయపడనని ప్రకటించారు.