శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (18:36 IST)

కమల్నాథన్ కమిటీ మా సూచనలు పట్టించుకోలేదు : 'T' ఉద్యోగులు

ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. స్థానికత అంశంలో తాము చేసిన సూచనలు కమిటీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు కదా.. అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వైబ్‌సైట్‌లో పొందుపర్చిన అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, స్థానికతపై తమ విజ్ఞప్తులు ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 
 
స్థానికత నిర్ధారణకు సరైన యంత్రాంగమంటూ లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికే తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికతను నిర్ధారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని, ఉద్యోగుల ఆప్షన్ ఫాంలో తల్లిదండ్రుల స్థానిక వివరాలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల విభజన చేసి ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు కోరుతున్నారు.