గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 30 జూన్ 2015 (16:28 IST)

కాబోయే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... చర్లపల్లి జైలు ముందు టి.తెదేపా కార్యకర్తలు

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. రేవంత్ ఈ సాయంత్రమే విడుదలవుతారన్న వార్తల నేపథ్యంలో అంతా చర్లపల్లి జైలు వద్దకు వెళుతున్నారు. మరోవైపు మంగళవారం హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తామని తెలంగాణ ఏజీ తెలిపారు. ఆయన దీనిపై స్పందిస్తూ తాము సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేస్తామన్నారు.
 
రేవంత్ బెయిల్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ఓటుకు నోటు కేసు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందన్నారు. చట్టం ప్రకారం 99 శాతం రేవంత్ రెడ్డికి బెయిల్‌ ఇవ్వకూడదనీ, ఆయన తెచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించాల్సి ఉందన్నారు. ఇంకా మరో రూ. 4.5 కోట్లు కూడా తెస్తామని చెప్పారు కనుక ఆ విషయాన్ని కూడా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఇంకా నిందితులు ఇద్దరు తమ ఎదుట హాజరు కాలేదని, అందువల్ల రేవంత్ రెడ్డి బెయిల్ కేసును సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు.