బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:45 IST)

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల: టాప్‌లో రంగారెడ్డి, బాలికలదే పైచేయి!

తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మళ్లీ రంగారెడ్డి జిల్లానే టాప్‌లో నిలిచింది. ఇక నల్గొండ జిల్లా కూడా 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉందని, రంగారెడ్డి జిల్లా మాత్రం 75 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 
 
మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, పరీక్ష ఫీజుకు అఖరు తేదీ మే 6గా నిర్ణయించినట్టు మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గత రెండేళ్ల కంటే ఈసారి ఇంటర్ ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. కాగా మే 1 నుంచి విద్యార్థులకు మార్కుల మెమోను అందజేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. 
 
కాగా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైదరాబాదులోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఒకేషనల్ రెగ్యులర్‌లో 3,78,973 మంది పరీక్షలకు హాజరవగా 2,32,742 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 61.41గా ఉందని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే 66.86 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారని కడియం వెల్లడించారు. బాలురు 65.9 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు.