శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 4 మే 2015 (14:12 IST)

అమెరికా పర్యటనలో టి మంత్రి కేటీఆర్.. నారా లోకేష్‌కు పోటీగానా?

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. 
 
అయితే, కేటీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేపట్టిన అమెరికా పర్యటనకు పోటీగా అగ్రరాజ్యానికి వెళుతున్నారనే ప్రచారం జోరుగాసాగుతోంది. వీరిద్దరు తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం అమెరికా బాట పట్టారు. 
 
ఈ పర్యటనలో భాగంగా నారా లోకేశ్ సోమవారం ఉదయానికే అమెరికా చేరుకోగా, మంగళవారం ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ అమెరికా బయలుదేరుతున్నారు. లోకేశ్ తన అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 7న ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. 
 
ఇక కేటీఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశం కానున్నారు. అంతకుముందే ఈ నెల 6న వాషింగ్టన్‌లోని భారత రాయబారితోనూ కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ మేరకు కేటీఆర్ టూర్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది.