గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: బుధవారం, 30 జులై 2014 (21:46 IST)

తెలంగాణలో ఆగస్టు 15 న మొదటి విడత భూ పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని దళితులకు భూ పంపిణీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు15 నుంచి మొదటి విడత భూ పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్నామని సెర్ప్ సీఈవో మురళీ తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దళితులకు భూ పంపిణీ అమలు-సాధ్యాసాధ్యాలపై చర్చ కార్యక్రమంలో మురళి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదన్నారు. మొత్తంగా తెలంగాణలో 34 శాతం మంది దళితులకు భూమిలేదన్నారు. మూడు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి కూడా భూ పంపిణీ చేయాలని చర్చలో పాల్గొన్న సీనియర్ విశ్లేషకులు శ్రీనివాస్ రెడ్డి సూచించారు.