శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (10:36 IST)

ఉస్మానియా వర్శిటీ విద్యార్థులకు ఉద్యోగాలెందుకివ్వాలి : నాయిని

కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంపై ఆందోళన నిర్వహిస్తున్న ఉస్మానియా విద్యార్థులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "అసలు ఉస్మానియాలో చదువుకుంటున్నవారందరూ పాసయ్యారా?... ఉద్యోగాలు వారికి ఎందుకివ్వాలి?" అంటూ ఆయన ఒంటికాలిపై లేచారు. విద్యార్థుల ఆందోళనను కావాలనే కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. 
 
మంగళవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యాలయ ఆవరణలో జరిగిన జాతీయ కార్మిక విద్యాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1969కు ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారందరూ మావోయిస్టులుగా మారారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని 1,000 మందికి పైగా విద్యార్థులు బలిదానం చేసుకున్నారని, వారి పుణ్యఫలితమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. 
 
ఆ తర్వాత ఆయన తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబు థాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి అని అన్నారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి దినోత్సవం సందర్భంగా తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్పై బుధవారం నాడు జాతీయ జెండా ఎగురవేశారు. సొంత దేశాన్ని వదులుకుని హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసిన నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలపాలని నాయిని అన్నారు.