బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (13:09 IST)

మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పడం ఖాయం : హరీష్ జోస్యం

మెదక్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం కాయమని తెలంగాణ మంత్రి హరీష్ రావు జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన మిగిలిన పార్టీలన్నీ రెండో స్థానానికే పోటీ పడుతున్నాయన్నారు. 
 
తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం, హైదరాబాద్ లో గవర్నర్ పాలనకు మొగ్గుచూపిన కేంద్రానికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజనే వద్దని వాదించిన జగ్గారెడ్డికి అసలు ఓట్లడిగే హక్కే లేదన్నారు. జగ్గారెడ్డిని బరిలో దింపడం ద్వారా బీజేపీ తమ విజయాన్ని మరింత సులభతరం చేసిందన్నారు. 
 
మూడు నెలల క్రితం ఓటమిపాలైన సునీతా లక్ష్మారెడ్డిని అంతలోనే ప్రజలెలా ఆదరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజార్టీ కంటే అధికంగా ఓట్లు సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలు ఏకమైనా టీఆర్ఎస్ అభ్యర్థికి ఏమాత్రం పోటీ రావన్నారు.