శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (11:18 IST)

అలాంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయాలి: తెలంగాణ మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా రూ.25కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చిన్న తరహ

రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా రూ.25కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చిన్న తరహా కంపెనీలు 85శాతం వున్నాయని మంత్రి తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. తద్వారా ఉద్యోగాలతో పాటు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. 
 
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ ఐప్లెక్స్ 2018ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ ఐపాస్ ద్వారా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయన్నారు. 
 
ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చిన్న మధ్య తరహా కంపెనీలు 85శాతం ఉన్నాయని.. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్‌ని నిషేధించామన్నారు. దీనికి ప్లాస్టిక్ ఇండస్ట్రీ సహకరించాలని కేటీఆర్ సూచించారు. రీ యూజేబుల్ ప్లాస్టిక్‌కి తాము సహకరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాంటి పరిశ్రమలతో కలిసి పనిచేస్తామని.. ఇలాంటి ప్లాస్టిక్ రహిత పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.