Widgets Magazine

అర్థరాత్రి మాజీ భార్య వద్దకెళ్లిన భర్త శవమై తేలాడు ఎలా?

అర్థరాత్రి పూట మాజీ భార్యతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన భర్త చివరకు శవమైతేలాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ మండలం చీటాకోడూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Ritu-Murdered
pnr| Last Updated: మంగళవారం, 10 జులై 2018 (14:32 IST)
అర్థరాత్రి పూట మాజీ భార్యతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన చివరకు శవమైతేలాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా జనగామ మండలం చీటాకోడూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
 
యాదాద్రి జిల్లా కొలనుపాకకు చెందిన ఉదయ్‌ 2017లో జనగామ జిల్లా చీటాకోడూర్‌కు చెందిన గంధమాల మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల కాపురం అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు సిద్ధమయ్యారు. రెండు నెలల క్రితం పెద్ద మనుషులు ఇరువురికి విడాకుల తీర్మానం కుదర్చగా ఇది గ్రామపంచాయతీ పెద్దల వద్ద పెండింగ్‌లో ఉంది. 
 
ఈనేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి వేళ విడాకులు కుదిరిన భార్యతో ఏకాంతంగా గడిపేందుకని ఉదయ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఉదయ్‌ను చూడగానే ఆమె కేకలు వేసింది. దీంతో అతడి మామ, బావమరిది, ఇతర బంధువులు కలిసి ఉదయ్‌ను చేశారు. 
 
ఈ హత్య అర్థారత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగింది. సంఘటనతో అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు పరారీ కాగా మామ ఎల్లయ్య, బావమరిది తెల్లవారుజామున పోలీసులకు లొంగిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


దీనిపై మరింత చదవండి :