గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (15:22 IST)

సారీ చెప్పక పోతే... చర్యలు తప్పవు : దిగ్విజయ్ సింగ్‌కు మంత్రి కేటీఆర్ వార్నింగ్

తమ రాష్ట్ర పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్

తమ రాష్ట్ర పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, అసంబద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. 
 
అంతేకాకుండా, తమ రాష్ట్ర పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే, తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 
 
మరోవైపు... తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ తయారు చేసి యువతను రెచ్చగొడుతునున్నారని, యువతను రెచ్చగొట్టాలని కేటీఆర్ పోలీసులకు అధికారమిచ్చారా? అంటూ దిగ్విజయ్ మంత్రి కేటీఆర్‌‍ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.