శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 26 నవంబరు 2014 (17:35 IST)

వ్యభిచారంలో ఇరుక్కున్న టీవీ నటి... పోలీసులు అరెస్ట్

టీవీ నటీమణులు ఈమధ్యకాలంలో 'అలాంటి' పరిస్థితుల్లో దొరికిపోవడం మామూలుగా జరిగిపోతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండకూడని విధంగా వున్న టెలివిజన్ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అర్ధరాత్రి వేళలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సదరు నటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
 
స్థానికంగా ఉండే ఓ బహుళ అంతస్తులో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందం అపార్ట్‌మెంటుపై దాడి చేసి పెద్ద ఎత్తున సాగుతున్న వ్యభిచారాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో మహిళలు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో జూనియర్ ఆర్టిస్ట్ స్వాతి కూడా ఉన్నట్లు సమాచారం. 
 
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ నిందితులను పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. వ్యభిచారం సమాచారాన్ని పోలీసులకు చేరవేసిన స్థానికులు, వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.