శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 29 మే 2017 (07:03 IST)

కుక్కల గుంపును ఇలా బెదరగొట్టి తరమాలి అని సినిమా చూపించిన పిల్లగాడు

ఉన్నట్లుండి మీమీదికి కుక్కల గుంపు ఒకటి వచ్చి ఎగాదిగా చూస్తే పెద్దవాళ్లకు సైతం అదురుపుడుతుంది. ఇక చిన్నపిల్లలయితే కుక్కలు చుట్టుముట్టగానే బోరుమని ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. ఇదే అదునుగా కుక్కలు వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన, చీ

ఉన్నట్లుండి మీమీదికి కుక్కల గుంపు ఒకటి వచ్చి ఎగాదిగా చూస్తే పెద్దవాళ్లకు సైతం అదురుపుడుతుంది. ఇక చిన్నపిల్లలయితే కుక్కలు చుట్టుముట్టగానే బోరుమని ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. ఇదే అదునుగా కుక్కలు వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన, చీల్చేసిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ నాలుగు కుక్కలు చుట్టుముట్టి దాడికి యత్నించినా ఏ మాత్రం బెదరకుండా శునకాలకే దడ పుట్టించాడు ఓ బుడుతడు.
 
వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి మూసాపేట్‌ ఆంజనేయనగర్‌లో శుక్రవారం అర్థరాత్రి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడికి యత్నించాయి. వారిలో ఓ చిన్నారి కుక్కల దాడిని ముందుగానే పసిగట్టి అక్కడి నుంచి పరుగెత్తి తనను తాను రక్షించుకుంది. మరో బాలుడు.. కుక్కలు విరుచుకుపడినా ఏ మాత్రం బెదరకుండా దాడికి యత్నిస్తున్న కుక్కలను బెదరగొట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ తతంగమంతా స్థానికంగా ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. 
 
వీడియోలో ఉన్న బాలుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణ కుమారుడిగా గుర్తించారు. జీవనాధారం కోసం వలస వచ్చిన కృష్ణ కుటుంబం మూసాపేటలోని శ్రీకాకుళంబస్తీలో నివాసం ఉంటోంది. శుక్రవారం రాత్రి వారి బంధువుల పెళ్లిలో ఉన్న సమయంలో చిన్నారులు చందు, పూజ ఆడుకుంటూ వీధిలోకి వచ్చిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
సిసి కెమెరాలో రికార్డయిన ఆ దృశ్యం ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ బాలుడు ఏమాత్రం తగ్గి ఉంటే కుక్కలు అమాంతం మీద పడేవి. ఆ అవకాశం ఇవ్వకుండా తరమడంతో కాస్సేపయ్యాక కుక్కలే తోక ముడిచి పారిపోయిన దృశ్యం చూస్తుంటే కడుపుబ్బ నవ్వు వస్తోంది మరి.