గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 13 జులై 2016 (21:04 IST)

చెట్లు నరికేసి మొక్కలు నాటడమా...? ఇదేంటి...? కేసీఆర్ సర్కార్ పైన హైకోర్టు అసంతృప్తి

ఒకవైపు హరిత హారం అంటూ కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది. స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కూడా మొక్కలు నాటారు. ఇంకా ఆయన ఇచ్చిన పిలుపుకి గత వారం నుంచి సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటడంలో బిజీ అయిపోయారు. కానీ హ

ఒకవైపు హరిత హారం అంటూ కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది. స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కూడా మొక్కలు నాటారు. ఇంకా ఆయన ఇచ్చిన పిలుపుకి గత వారం నుంచి సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటడంలో బిజీ అయిపోయారు. కానీ హైదరాబాదు కేబీఆర్ పార్కు వద్ద మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను నరికివేశారు. 
 
దీనిపై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారణకు చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం తీరుపై ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసింది. అడవులు తరిగిపోయాయని మొక్కలు నాటాలంటూ చెపుతున్న ప్రభుత్వం ఇలా ఏళ్ల తరబడి ఉన్న చెట్లను నరికివేయడమేమిటంటూ ప్రశ్నించింది. చెట్లు నరకేయకుండా చేపట్టాల్సిన చర్యలపై పిటీషనర్‌ను అడిగిన పిదప తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.