గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2015 (19:38 IST)

కేసీఆర్ పాలన... కోదండరాం ఫైర్... వాస్తు వదిలేయండి...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, విధానాల పైన తెలంగాణ పొలిటికట్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తొలిసారిగా విమర్శనాస్త్రాలు సంధించడం విశేషం. ముఖ్యంగా హైదరాబాదులోని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని అనంతగిరి అడవుల్లోకి తరలించి, సచివాలయాన్ని ఎర్రగడ్డకి తరలించాలన్న కేసీఆర్ ప్రణాళికపై సర్వత్రా వ్యతిరేకం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో దీనిపై వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు గురువారంనాడు జరిగింది.
 
ఈ సదస్సులో కోదండరాం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సరికాదని హితవు పలికారు. అసలు వాస్తు మార్గదర్శకం ప్రకారం పాలన సాగించడం మంచిది కాదని, రాజ్యాంగం ప్రకారమే పాలన చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి పేరిట విధ్వంసానికి గురైందనీ, దాని చరిత్రను తెలుసుకుని మసలుకోవాలని పరోక్షంగా కేసీఆర్ కు హెచ్చరికలు చేశారు.