మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 11 మార్చి 2017 (16:52 IST)

కేసీఆర్ ముందు మోదీ పప్పులుడకవ్... తెరాస ఎంపీ జి.వినోద్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా ఇక దక్షిణాదిపై టార్గెట్ పెడుతుందని ఏపీ భాజపా నాయకులు చెపుతున్నారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో వున్నాయనీ, దక్షిణాదిలో కూడా పార్టీ విస్తరిస్తుందని అంటున్నారు. దీనిపై ఓ ప్ర

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా ఇక దక్షిణాదిపై టార్గెట్ పెడుతుందని ఏపీ భాజపా నాయకులు చెపుతున్నారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో వున్నాయనీ, దక్షిణాదిలో కూడా పార్టీ విస్తరిస్తుందని అంటున్నారు. దీనిపై ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానల్లో చర్చ జరిగింది. తెలంగాణపై కూడా వచ్చే 2019 ఎన్నికల్లో భాజపా తన సత్తా చూపుతుందని భాజపా నాయకుడు అన్నారు. 
 
చర్చలో పాల్గొన్న తెరాస ఎంపీ జి.వినోద్ మాట్లాడుతూ... దేశంలో ఎక్కడయినా మోదీ ప్రభంజనం వీస్తుందేమో కానీ దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ముందు మాత్రం సాధ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఉద్యమం చేసి, ఆ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా వున్న తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఒకవేళ బలపడితే కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందేమో కానీ, తెరాసకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు.
 
ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపా ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. భాజపాది అద్వితీయ విజయమేననీ, భాజపా విజయం సాధించడం ద్వారా దేశంలో ఆర్థిక సంస్కరణలు మరింత ఊపందుకుంటాయని అభిప్రాయపడ్డారు. తాము భాజపాకు అంశాలవారీగా మద్దతిస్తున్నామనీ, తమ మద్దతు భాజపాకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.