శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (14:03 IST)

తెలంగాణకు నేను అడ్డంకాదు నిలువు కాదని వైఎస్సార్ అన్నారు.. వారు దద్దమ్మలు- సన్నాసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో వాడిన భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రులపై కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. తాజాగా కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మరోసారి పరుష

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో వాడిన భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రులపై కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. తాజాగా కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మరోసారి పరుష పదజాలంలో ఏకిపారేశారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. గతంలో ఇదే మైదానంలో ఎన్నో సభలు నిర్వహించామన్నారు. 
 
ఈ మైదానంలో ప్రొ.జ‌య‌శంక‌ర్ ముందు మాట్లాడాక, ఆ త‌రువాత తాను మాట్లాడేవాడినని అన్నారు. ఇదే ఓరుగల్లు వేదికగా ఎన్నో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లామని, పోరాటాలు చేశామని ఆయన అన్నారు. ఓరుగ‌ల్లు పోరుగ‌ల్లు నిజ‌మేక‌దా? అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అన్ని వ‌ర్గాల సంక్షేమానికి ప్రాధాన్య‌త ఇస్తూ.. మూడేళ్ల పాల‌న‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్నామ‌ని కేసీఆర్ అన్నారు.
 
పనిలో పనిగా కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ఏకిపారేశారు. బీజేపీ గురించి కేసీఆర్ నోరెత్తక పోయినా.. కాంగ్రెస్ వారిని మాత్రం దద్దమ్మలు, సన్నాసులు అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు పౌరుషం లేదు. పదవులు, పైరవీల కోసం.. తెలంగాణలో ప్రజలు వలసపోయే కర్మ తీసుకువచ్చింది ఈ సన్నాసులే. 45 వేల చెరువులను పునరుద్ధరించాలని ఎప్పుడైనా ఒత్తిడి తెచ్చారా? ఇప్పుడేమో నీళ్లు రాకుండా శిఖండిలా అడ్డం పడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. 
 
తెలంగాణ కరవుకు, కరెంటు షాకులతో రైతుల చావులకూ కాంగ్రెసోళ్ల తెలివితక్కువ విధానాలే కారణం అని కేసీఆర్ మండిపడ్డారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు తాను అడ్డం కాదు.. నిలువు కాదని దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆనాడు ఎందుకు రాజీనామా చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు.