Widgets Magazine

నా పుట్టుక తెరాసలోనే.. నా చావు కూడా తెరాసలోనే : మంత్రి హరీష్ రావు

శుక్రవారం, 9 మార్చి 2018 (15:10 IST)

harish rao

పార్టీ మారుతున్నట్టు సాగుతున్న దుష్ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. తన పుట్టుక తెరాసలోనే.. తన చావు కూడా తెరాసలోనే అంటూ పునరుద్ఘాటించారు. దేశంలో మూడో ప్రత్యామ్నాయం కావాలంటూ, దానికి తనవంతు కృషి చేస్తానంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. 
 
ఈ దిశగా ఆయన అడుగులు కూడా వేస్తున్నారు. దీంతో ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ నియమితులవుతారన్న ఊహాగానాలు వచ్చాయి. దీన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ మేనల్లుడు టి హరీష్ రావు.. బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై హరీష్ రావు స్పందించారు. 
 
తాను తెరాసను వీడే ప్రసక్తే లేదన్నారు. నేను పుట్టింది తెరాసలో.. నా చావు కూడా తెరాసలోనే అంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్టు హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాకిస్థాన్‌ను ''స్పెషల్ టెర్రరిస్ట్ జోన్‌''గా పిలిచిన భారత్... ఎక్కడ?

పాకిస్థాన్‌కు భారత్ కొత్త పేరు పెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను ...

news

ఏపీ ప్రత్యేక హోదా వాగ్దానమే బీజేపీ కొంపముంచుతుందా?

అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ...

news

12 ఏళ్ల విద్యార్థినిపై 50 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం... ఆటోలో స్కూలుకు తీసుకెళుతూ...

ఆటో డ్రైవరును నమ్మినందుకు విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ...

news

రోడ్డు ప్రమాదం... కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృత్యువాత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ...

Widgets Magazine