బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (14:56 IST)

ఏబీఎన్ - టీవీ9 ప్రసారాల నిలిపివేత .. సుప్రీంకోర్టులో పిటీషన్!

తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ-9 ఛానెల్స్ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాలను నిలిపివేస్తూ ఎంఎస్‌వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది.
 
ఈ కేసుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఎస్‌వోలతో పాటు మరో 15 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌ సీపీ, ఎంఎస్‌వో అసోసియేషన్‌కు నోటీసులు అందజేసింది. వీటిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఏబీఎన్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. మొదటి పిటిషన్‌లో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్న ఏబీఎన్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎంఎస్‌వోలు ప్రైవేటు వ్యక్తులైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్న ఏబీఎన్‌ వాదనను కోర్టు అంగీకరించింది.