మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (18:31 IST)

భార్యకు టెక్కీ బూతు మెసేజ్‌లు... పట్టుకున్న సైబర్ క్రైం పోలీసులు

భార్యకు బూతు మెసేజ్ లు పంపిస్తూ పైశాచికానందం పొందుతూ, టార్చర్ పెడుతున్న 47 ఏళ్ల అమెరికా బేస్డ్ సాఫ్వేర్ ఇంజినీర్ ప్రవీణ్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఐతే అతడి భార్య తన పిల్లలు కుటుంబ పోషణ నిమిత్తం నిర్వహణ ఖర్చులు భర్త తనకు ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది. 
 
ఈ కేసు ఆమెకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉండటంతో ప్రవీణ్ ఆమెపై కసి పెంచుకున్నాడు. దాంతో ఆమెకు సమీపంలో ఉన్న నెట్ సెంటర్ నుంచి బూతు మెసేజ్ లు పంపడం మొదలుపెట్టాడు. తనకు వస్తున్న సందేశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సైబర్ క్రైం పోలీసులు విచారించి, అవి పంపిస్తున్నది ప్రవీణేనని తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న అతడు అమెరికా చెక్కేసేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు అతడి ప్రయత్నాన్ని భగ్నం చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.