శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (16:03 IST)

పొన్నాల పనితీరు సూపర్బ్.. వీహెచ్‌కు ధన్యవాదాలు : ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రానికి తొలి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పొన్నాల లక్ష్మయ్యపై పీసీసీ కొత్త సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ, సమర్థవంతంగా పరిష్కరించగలిగారని చెప్పారు. 
 
కాగా, పొన్నాల స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనికితోడు, ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారో అర్థం కావడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయినా, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని... పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకంపై సోనియా, రాహుల్ గాంధీ, వి.హనుమంతరావులకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, దారుణ పరాజయాలతో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగినట్టుంది. దీంతో ప్రక్షాళనపై దృష్టిపెట్టింది. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేని పీసీసీ చీఫ్‌ల స్థానంలో కొత్త వారిని నియమించింది. రాహుల్ గాంధీ వచ్చేనెలలో ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, ఆయనతో పని చేసేందుకు కొత్త టీంను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఐదు రాష్ట్రాల్లో కొత్త పీసీసీ చీఫ్‌లను ఏఐసీసీ నియమించింది. వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు.