బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (11:52 IST)

'మా విడాకులకు రండి'.... ఓ భర్త వినూత్న ఆహ్వానం.. ఎక్కడ?

సాధారణంగా భార్యాభర్తలు కోర్టుల ద్వారా విడాకులు పొందుతుంటారు. అదీకాకుంటే గ్రామాల్లో పంచాయతీ పెద్దలు చెప్పిన తీర్పుతో విడిపోతుంటారు. అయితే, వంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన కలకొండ సురేష్‌ మాత్రం తన విడాకులను వినూత్నంగా చేసుకోవాలని నిర్ణయించాడు. అంతే... తమ విడాకులకు రావాలంటూ పోస్టర్లు ముద్రించి గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తూ వీధుల్లోని గోడలకు అంటించి కలకలం సృష్టించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.... దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన కలకొండ సురేష్‌కు ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ముత్తోజు వెంకట్రాజం - రాజమణిల కూతురు ఉమను 2013లో కట్నకానుకలతో వివాహం జరిపించారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం ఉమను అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య అనేక సార్లు పంచాయితీ నిర్వహించారు. 
 
ఇదే క్రమంలో ఉమ భర్త సురేష్ మరో ఐదుగురితో కలిసి ఈ నెల 14న విడాకుల పంచాయితీ నారాయణగిరి గ్రామంలోని వీధుల్లో నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ విడాకుల పంచాయితీకి ఆహ్వానితులే అంటూ ముద్రించిన వాల్‌పోస్టర్లను నారాయణగిరిలో సురేష్ అంటించి కలకలం సృష్టించాడు. వాల్ పోస్టర్లు అంటించి తనను అవమానపరుస్తున్న తన భర్త కు బుద్ధి చెప్పి తన సంసారాన్ని నిలపెట్టాల్సిందిగా ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.