బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (10:49 IST)

కరీంనగర్‌లో భర్త తలపై ఐరన్ రాడ్‌తో కొట్టి చంపిన భార్య!

కరీంనగర్ జిల్లాలో ఓ భార్య తన భర్తని ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేసింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఐడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. భర్త సర్దుకుపోతున్నా భార్య ఆవేశంతో ఊగిపోతూ అక్కడే ఉన్న ఇనుప రాడ్‌తో భర్త తల మీద ఒక్క వేటు వేసింది. దాంతో ఆ భర్త అక్కడిక్కడే మరణించాడు. 
 
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ దంపతుల మధ్య తరచుగా కుటుంబ కలహాలు వస్తుండేవి. దీనికితోడు అక్రమ సంబంధం అంటగట్టడంతో తీవ్ర ఆగ్రహం చెందిన భార్య... ఈ హత్యకు చేసిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.