బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (18:59 IST)

చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తాం: కేసీఆర్

వచ్చేనెల 23న నిర్వహించే చండీయాగానికి ఏపీ  సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీపీఐ నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం తప్పని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
తన సొంత ఖర్చుతోనే ఈ చండీయాగాన్ని నిర్వహిస్తానని.. కొందరు ఔత్సాహికులు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ యాగంలో 4,500 మంది బ్రాహ్మణులు, 1500 మంది రుత్వికులు పాల్గొంటారని కేసీఆర్ వెల్లడించారు. తానొక్కడినే ఈ యాగాన్ని డబ్బు వెచ్చించి నిర్వహించడం కుదరదని.. స్పాన్సర్లు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. 
 
ఈ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు ఫామ్ హౌస్ (హైదరాబాద్ శివారు ఎర్రవెల్లి-మెదక్ జిల్లా)లో ఈ చండీయాగం జరుగనుందని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.