Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించా.. మరి నా సంగతేంటి' : సర్పంచ్‌ భర్తకు చెప్పుదెబ్బలు

మంగళవారం, 4 జులై 2017 (14:06 IST)

Widgets Magazine
pushpalatha

ఓ గ్రామ సర్పంచ్‌కు చెప్పుదెబ్బలు పడ్డాయి. టీచర్ ఉద్యోగం ఇప్పించినందుకు బహుమతిగా తన కోర్కె తీర్చాలంటూ వేధించినందుకు ఆ మహిళ తనదైనశైలిలో సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి పట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెద్దపల్లి మండలం మూలసాల‌ సర్పంచ్ భర్త కొమరయ్య. ఈయన తన పలుకుబడిని ఉపయోగించి పుష్పలత అనే మహిళకు అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా ఇప్పించాడు. ఆ తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. "నీకు అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించాను. నా సంగతి ఎప్పుడు చూస్తావు?" అంటూ లైంగికంగా వేధించాడు. 
 
ఈ వేధింపులను తట్టుకోలేని బాధితురాలు సర్పంచ్ భర్తను చెప్పుతో కొట్టడమేకాకుండా, స్థానిక పోలీస్ పోలీసులను ఆశ్రయించింది. తన కోరిక తీర్చాల్సిందేనని వెంటపడుతుంటే, తట్టుకోలేక చెప్పుతో కొట్టానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కొమరయ్య మరోలా స్పందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తాను పాఠశాలలోకి మార్పించినందునే తమ ఆటలు సాగవన్న భయంతో ఆమె ఈ విధమైన దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అయితే, చెప్పుదెబ్బల విషయం బయటకు పొక్కిన తర్వాత, గ్రామ పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదర్చినట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రామోజీరావు ఇంట పెళ్లి సందడి... తరలిరానున్న ప్రముఖులు...

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్. రామోజీరావు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద ...

news

గుడ్ వర్క్‌కు దక్కిన రివార్డు... వెలుగునిచ్చే దీపానికి సొంతిల్లు ఉండదు ... బదిలీపై శ్రేష్టా ఠాకూర్

నిజాయితీగా విధులు నిర్వహించినందుకు డీఎస్పీ శ్రేష్టా ఠాకూర్ అధికారిణికి ఉత్తరప్రదేశ్ ...

news

అన్నే కాటేశాడు... చెల్లిని వంచించి గర్భవతిని చేశాడు... ఎక్కడ?

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్న కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునే పాడుపనికి పాల్పడ్డాడు. ...

news

షాకింగ్... హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్(వీడియో)

ఎర్రచందనం దొంగలు రకరకాల దారుల్లో స్మగ్లింగ్ చేసేస్తున్నారు. తాజాగా హెరిటేజ్ కి చెందిన ఓ ...

Widgets Magazine