Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు పెట్టి.. బాత్‌రూమ్‌కు వెళితే ఇంట్లోంచి చూస్తూ, గర్భవతిని పెరేడ్ చేయించి.. ఇదిరా పోలీస్!

హైదరాబాద్, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (02:56 IST)

Widgets Magazine

ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారి పోలీసు స్టేషన్‌లోనే సీసీ కెమెరాలు పెట్టి మహిళా పీసీలు బాత్ రూమ్‌కి వెళ్లే దృశ్యాలను తన ఇంటినుంచి చూస్తూ పైశాచికానందాన్ని పొందడాన్ని తట్టుకోలేక  ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ స్టేషనలోనే ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది. తమను వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసు కమిషనర్‌కు విన్నవిస్తే అప్పటినుంచి కష్టమైన డ్యూటీలు వేస్తూ ఇబ్బంది పెట్టడంతో తట్టుకోలేకపోయిన ఆ మహిళా కానిస్టేబుల్ జీవితంపైనే విరక్తి పెంచుకుని గాజు పెంకులతో చేతులు కోసుకుంది.
 
వివరాల్లోకి వస్తే వరంగల్‌ స్పెషల్‌ బ్రాంచి కార్యాలయం ముందు ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు ప్రయత్నించారు. అధికారుల ముందే మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ ఇల్లందుల జమునారాణి గాజు పెంకులతో చేతులు కోసుకుంటూ సీఐ విష్ణుమూర్తి వేధింపులను అడ్డుకోవాలని కేకలు వేశారు. గాజుపెంకులతో మెడ కోసుకునేందుకు ప్రయత్నించగా అక్కడున్న పోలీసు అధికారులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోలేదని సమాచారం. 
 
వరంగల్‌ గ్రామీణ మహిళా పోలీసుస్టేషన్‌ సీఐ విష్ణుమూర్తి వేధించడంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించానని జమునారాణి పేర్కొన్నారు. ‘‘ఠానాలో సీసీ కెమెరాలు అమర్చిన అధికారి తమ కార్యక్రమాలను ఇంట్లో నుంచి చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు’’ అని ఆరోపించారు. తాము బాత్రూంకు వెళ్లినా అనుమానిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడన్నారు. హన్మకొండ కలెక్టరేట్‌ సమీపంలోని సుబేదారి పోలీసు స్టేషన్‌ పైఅంతస్తులో రూరల్‌ మహిళా పోలీసు స్టేషన్‌ ఉంది. జమునారాణి అక్కడ హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తనను విష్ణుమూర్తి మానసికంగా వేధిస్తున్నారన్నారు. ‘‘నేను చెప్పినట్లు డ్యూటీ చేయాలి. లేకుంటే మానేయండి.’’ అంటూ ఆబ్‌సెంట్‌ వేసేవారన్నారు
 
స్టేషన్‌లోని అవకతవకలపై 3 నెలల కిందట సీపీ సుధీర్‌బాబుకు సిబ్బంది మొరపెట్టుకున్నారని, అప్పటి నుంచి స్టేషన్‌ అధికారి తనకు కష్టమైన డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. కానిస్టేబుల్‌ చేసే డ్యూటీలు హెడ్‌కానిస్టేబుళ్లతో చేయిస్తూ తనకు అనుకూలం కాని వారికి డ్యూటీలే వేసేవాడు కాదన్నారు. తనకు విష్ణుమూర్తి నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు. గర్భవతులని కూడా చూడకుండా మైదానంలో పరేడ్‌ చేయాలంటూ నరకం  చూపించేవాడన్నారు. అధికారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తనకు స్థానిక పీఎ్‌సలో కాకుండా స్పెషల్‌ బ్రాంచీలో పని చేయాలని బుధవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిపై మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించానన్నా రు. 
 
కొసమెరుపు ఏమిటంటే.. ఈ ఘటనపై సీఐ విష్ణుమూర్తి స్పందిస్తూ.. జమునా రాణిని స్టేషన్‌లో సరిగా ఉద్యోగం చేయమంటే.. కొందరు సిబ్బందిని కూడగట్టుకుని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. యధాప్రకారం పై అధికారులు శ్రీమాన్ సీఐ గారికి వత్తాసు పలుకుతూనే ఉన్నారని వార్తలు
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాతికేళ్లు జైల్లో మగ్గిపోయాక ప్రపంచాన్ని తొలిసారి చూసిన రాజీవ్ హంతకుడు.. మళ్లీ మరోనేరమా?

అది క్షణికావేశమో.. కరడుగట్టిన సిద్ధాంతం ప్రభావమో.. తదనంతర పరిణామాలను ఊహించని అమాయకత్వమో.. ...

news

వివాహేతర సంబంధం... మరొకరితో లింక్ పెట్టుకుందని టీచర్ గొంతుకోసిన మరో టీచర్(video)

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. చిత్తూరు జిల్లాలో గురువారం దారుణం ఘటన జరిగింది. గంగవరం మండలం ...

news

ప్రియురాలి కోసం విమానం హైజాక్... హైదరాబాద్ యువకుడు....

పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి ...

news

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని ...

Widgets Magazine