తనపై సినిమా ఇండస్ట్రీ బ్యాన్ విధిస్తుందంటూ వస్తున్నవార్తలకు నటుడు ప్రకాష్‌రాజ్ ఫుల్స్టాప్ పెట్టారు. అసలు తనపై ఎటువంటి బ్యాన్ లేదనీ, అదంతా వట్టి పుకారేనని తేల్చి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొడవ గురించి వివరిస్తూ.... 'ఆగడు' సినిమాలో దర్శకత్వ శాఖలోని ఓ వ్యక్తికి తనకు మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది.అతను ఒక మాట అంటే నేనూ మరో మాట అన్నాను. అది అంతటితో సమసిపోయింది. కానీ అందులోని మరో వ్యక్తి దీన్ని రాద్దాంతం చేసి పెద్దది చేశారనీ, డైరెక్టర్స్ అసోసియేషన్ దాకా తీసుకెళ్ళి పెద్ద గొడవ చేశాడనీ, అతను ఎవరనేది తనకు తెలుసుననీ, పేరు మాత్రం చెప్పనని, త్వరలో ఆయనే బయటకు వస్తాడని వెల్లడించారు.