రమణీయ దృశ్యమాలికలను ఆవిష్కరించే వెండితెరపై ఒకప్పుడు నాలుగు గోడల మధ్య అమర్చిన సెట్టింగులు... బ్లాక్ అండ్ వైట్ లో కళ్లముందు ఆవిష్కరింపజేసేవారు నాటి దర్శకనిర్మాతలు. నిండుపున్నమి వెండివెన్నెల కాంతులను అత్యంత అద్భుతంగా పూయించేవారు.