ఎవడు కోసం జంజీర్ నుంచి నేరుగా రామ్ చరణ్

Venkateswara Rao. I|
WD
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మళ్లీ ‘ఎవడు' షూటింగులో పాల్గొననున్నాడు . కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాడు.

ఎవడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌‍పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లు. సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందని అనే వార్తలు వస్తున్నా ఇంకా సరైన సమాచారం లేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీస్టారర్ మూవీగా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడి కాగా, జనవరిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :