స్లమ్డాగ్ మిలీయనీర్ సినిమాతో ఆస్కార్ అవార్డు పొందిన ఎ.ఆర్. రెహమాన్‌కు సుప్రసిద్ధ గాయని గానకోకిల, పి. సుశీల ఆత్మీయ సత్కారం చేయనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ మారియెట్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఎ.ఆర్. రెహమాన్‌ను గౌరవించనున్నట్లు సుశీల విలేకరులతో తెలిపారు.