కొడుకుతో గోవాలో మహేష్....వేర్వేరుగా షూటింగ్

Ganesh| Last Modified శనివారం, 9 నవంబరు 2013 (16:01 IST)
FILE
ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా 'తెరంగేట్రం' చేస్తున్నాడు. తన డాడీ నటిస్తున్న 'నేనొక్కడినే' మూవీలో ఈ కుర్రాడు ఇదివరకే కొన్ని సీన్స్‌లో నటించాడు. ప్రస్తుతం మహేష్, గౌతమ్‌లు గోవాలో ఉన్నారు. దర్శకుడు సుకుమార్ అధ్వర్యంలో వీరిద్దరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

అలా అని ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తారనుకుంటే పొరపాటే. ఇద్దరిపై వేర్వేరుగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో కూడా వేర్వేరుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో గౌతం నటిస్తున్నాడు. గోవా షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగు పూర్తవుతుందని సమాచారం.

సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ దాదాపు తన కెరీర్‌ని ఆరంభించినట్టే అంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా గౌతమ్‌కి ఏ ఫీల్డ్ ఇష్టమో అందులో అతడ్ని ఎంకరేజ్ చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. తాను కూడా బాలనటుడిగానే సినీ కెరీర్‌ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.


దీనిపై మరింత చదవండి :