'1' సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు గురువారం గోవా వెళ్ళాడు. నేటి నుంచి అక్కడి వివిధ లొకేషన్లలో వారం రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్లో తండ్రీకొడుకులు మహేష్, గౌతమ్లపై అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ షెడ్యూల్తో చిత్ర నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.