గౌరీ పండిట్ హీరోయిన్‌గా "హౌస్‌ఫుల్"

FILE

గౌరీ పండిట్.... ఈ పేరు ఎక్కడో విన్నట్లు....ఈ అమ్మాయిను కూడా ఎక్కడో చూసినట్లనిపిస్తోంది కదూ...! గోపీచంద్ హీరోగా నటించిన "ఆంధ్రుడు" సినిమాలో కథానాయికగా నటించిన అమ్మాయే... గౌరీపండిట్. ప్రస్తుతం ఆమె చంద్రసిద్దార్థ నిర్మిస్తున్న "హౌస్‌ఫుల్" అనే చిత్రంలో నటిస్తోంది.

ఫిల్మోత్సవ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విపిన్, వేగ, ఆర్యన్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రం షూటింగ్ దసరా నాడు వైభవంగా ప్రారంభమైంది. అక్టోబర్ 21వ తేదీతో తొలి షెడ్యూల్ పూర్తయింది.

ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ... తొలి షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలను, ఓ పాటను చిత్రీకరించామన్నారు. అక్టోబర్ 29 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైందని, సినిమా పూర్తయ్యే వరకు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. సినిమా టైటిల్ "హౌస్‌ఫుల్" చూసి సినిమా నేపథ్యంలో నడిచే కథ కూడా అలాగే ఉంటుందని అనుకుంటే పొరబాటేనని, చిత్ర కథకు సినిమా నేపథ్యానికి ఏ మాత్రం సంబంధముండదని చెప్పారు.

ఒక్క రాత్రిలో జరిగే కథను రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నామని నిర్మాత వెల్లడించారు. పక్కా స్క్రీన్‌ప్లే బేసిడ్ సబ్జెక్ట్ ఇదని, దర్శకుడు అజయ్ భుయాన్ చెప్పిన కథ తన ఆలోచనలకు, అభిరుచికి దగ్గరగా ఉందని నిర్మాత అన్నారు. దర్శకుడు నూయార్క్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో డిగ్రీ చేశాడని ఆయన వివరించారు.

SELVI.M|
నైనీ దీక్షిత్, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, ఆర్. కె. అంబటి శ్రీను, టార్జన్, సత్తన్న, దాసన్న తదితరులు నటిస్తున్న... ఈ చిత్రానికి కూర్పు.. శ్రావణ్, కెమెరా... వి. ఎస్. జ్ఞానశేఖర్, సంగీతం... అనూప్, నృత్యాలు... మిస్‌బా చౌదరి, విద్య, కళ.... నాగేంద్రప్రసాద్.


దీనిపై మరింత చదవండి :