పరుచూరి రవిబాబు హీరోగా 'రాస్కెల్'

SELVI.M|
'అసాధ్యుడు' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కె.అనిల్ కృష్ణ తాజాగా పరుచూరి రవిబాబు, నైనా జంటగా రూపొందిస్తున్న చిత్రం 'జంక్షన్'. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, శాఖమూరి పాండురంగారావు సమర్పణలో కె.అనిల్‌కృష్ణ దర్శకనిర్మాతగా ఎ గ్యాంగ్ ప్రొడక్షన్ బేనర్‌ స్థాపించి పరుచూరి రవిబాబు హీరోగా జంక్షన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కాంబినేషన్‌లో 'రాస్కెల్' అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న 'రాస్కెల్' చిత్రం లోగోని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నవంబర్ 7వ జంక్షన్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆవిష్కరించగా ఎ గ్యాంగ్ ప్రొడక్షన్ బేనర్‌ని ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సమర్పణ.. శాఖమూరి పాండురంగారావు, సంగీతం.. జాన్‌సాల్మన్, కెమెరా.. వెంకట్, కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. కె.అనిల్ కృష్ణ.


దీనిపై మరింత చదవండి :