మహేష్ బాబు ఆగడులో తమన్నా స్వీట్స్ అమ్ముతుందా? పోలీస్ ఆఫీసరా?

SELVI.M|
WD
మహేష్ బాబు ఆగడులో తమన్నా స్వీట్స్ అమ్ముతుందా? పోలీస్ ఆఫీసరా? అనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే.

'దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ చిత్రం సెట్స్‌పై ఆమె స్వీట్స్ అమ్ముతూ కనిపించింది. ఆమె ఈ చిత్రంలో పోలీస్ పాత్రను పోషిస్తోందని వినికిడి. మరి ఈ స్వీట్స్ అమ్మటానికి, పోలీస్ పాత్రకు సంభంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందేనని సినీ యూనిట్ అంటోంది.

అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని, కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకు వచ్చిందని సమాచారం.


దీనిపై మరింత చదవండి :