రామ్ చరణ్- శ్రీనువైట్ల- డివివి దానయ్య కాంబినేషన్‌లో భారీ చిత్రం!

Ganesh|
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. చరణ్ నటించిన 'నాయక్‌' చిత్రాన్ని అందించిన యూనివర్సల్‌ మీడియా అధినేత దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. ప్రముఖ తారాగణంతో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.

ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీను వైట్ల అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. నాయక్‌, ఎవడు తర్వాత రామ్‌ చరణ్‌ ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌పై కన్నేశాడు. వీరిద్దరి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నిర్మాత. దూకుడు చిత్రం టాప్ లేపేసే యాక్షన్ అండ్ కామెడీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని అంటున్నారు.

మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత పవన్‌ కళ్యాణ్‌తో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి వంటి చిత్రాలు నిర్మించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు


దీనిపై మరింత చదవండి :