విజయదశమి నాడు షూటింగ్‌ల సందడి

FILE
విజయదశమి పర్వదినాన భాగ్యనగరంలో తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి నెలకొంది. రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోలతో పాటు జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రైవేట్ భవంతుల్లో కొంతమంది లాంఛనంగా సినిమాలు ప్రారంభిస్తే... మరికొంత మంది రెగ్యులర్ షూటింగ్‌లను జరుపుకున్నారు.

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో నేడు ప్రారంభమైంది. నిరాడంబరంగా బాలయ్య షూటింగ్ జరిగింది. మరికొన్ని సినిమాలు సంస్థ కార్యాలయాల్లో ప్రారంభించారు. రవితేజ, నితిన్, రాజీవ్ కనకాల, శివాజీతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ మరికొన్ని చిత్రాలు కూడా దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
FILE

ఇందులో భాగంగా... రవితేజ, ఇలియానా జంటగా, ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న కొత్త సినిమా ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించుకుంది. వెంకట్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో రవితేజ, ఇలియానాలపై జరిగిన ముహూర్తపు షాట్‌కు మోహన్ బాబు క్లాప్ కొట్టగా, వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
FILE

ఇదే విధంగా ఊహల్లో వచ్చిన అమ్మాయి నిజజీవితంలో ఎదురైతే ఏమవుతుందనే? పాయింట్‌తో "ఊహాచిత్రం" అనే ప్రేమ కావ్యం తెరకెక్కనుంది. డా. పెద వీర్రాజు సమర్పణలో లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై కె. పైడిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరానాడు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వంశీకృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతుండగా "నగరం" ఫేమ్ కావేరీఝా కథానాయికగా నటిస్తోంది.
FILE

రాజీవ్ కనకాల ప్రధాన హీరోగా అరవింద్, రిషీ కుమార్ హీరోలుగా ఐశ్వర్య దుర్గల్ హీరోయిన్‌గా పవన్ సుత ఫిలింస్ ఓ చిత్రాన్ని దసరానాడు ప్రారంభించింది. వుప్పుల రమేష్, గోగినేని సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. కిషోర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.

"సై" హీరో నితిన్, ఇలియానా జంటగా స్ప్రైక్ట్రా మీడియా అనే నూతన నిర్మాణ సంస్థ ఓ చిత్రాన్ని ప్రారంభించింది. జి.వి.రమణ నిర్మాతగా, పరుచూరి మురళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Harsha Vardhan|
కాసు బ్రహ్మానంద రెడ్డి బేనర్‌పై శశి హీరోగా ఓ చిత్రం దసరానాడు ప్రారంభమైంది. కాసు బ్రహ్మానంద రెడ్డి మనుమడు కె. దినేశ్ రెడ్డితో పాటు శిశిర్‌రావ్, శివిత్‌రావ్ నిర్మాతలు కాగా, "అల", "కల" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మోహన్ చిమ్మని దర్శకత్వం వహిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :