విజయభాస్కర్ - అచ్చిరెడ్డి కాంబినేషన్‌లో కొత్త చిత్రం

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
కొబ్బరి బొండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించి హంగామా, సామాన్యుడు, గుండమ్మగారి మనవడు, కిక్ వంటి చిత్రాలను ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సమర్పించిన నిర్మాత కె.అచ్చిరెడ్డి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి జూలైలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విజయభాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రం గురించి అచ్చిరెడ్డి మాట్లాడుతూ... విజయభాస్కర్ గారి దర్శకత్వంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఓ మంచి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. సబ్జెక్ట్ రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా "ఆది" అనే కొత్త హీరోను పరిచయం చేస్తున్నాం. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.


దీనిపై మరింత చదవండి :