విదేశాలకు వెళ్లనున్న "ఆంజనేయులు"

WD
క్రేజీస్టార్ రవితేజ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్‌బాబు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం "ఆంజనేయులు". "యువత" ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ.. ఏప్రిల్ 22 నుంచి ఏకధాటిగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్నామన్నారు. దాదాపు 75లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన కార్పొరేట్ ఆఫీస్ సెట్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

ఈ నెల (మే) 16వరకు హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరిస్తామని నిర్మాత అన్నారు. మే 18 నుంచి 26వరకు ఆమ్‌స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రియాల్లో, రవితేజ, నయనతారలపై రెండు పాటల్ని చిత్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 20వరకు సాగే షూటింగ్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందన్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. రవితేజలో ఉన్న ఎనర్జిటిక్, సిన్సియారిటీ, బిహేవియర్ వంటి కారణాలను చూస్తే అవే ఆయనను ఉన్నత స్థితికి ఎదగడానికి కారణాలని నిర్మాత కొనియాడారు. రవితేజ కెరీర్‌లోనే "ఆంజనేయులు" సూపర్ హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

SELVI.M|
రవితేజ, నయనతార, సోనూ సూద్, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజారవీంద్ర, అలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ.. కె. రవీంద్రబాబు, సంగీతం.. ఎస్. థమన్, ఎడిటింగ్.. మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్.. రామ్‌లక్ష్మణ్.


దీనిపై మరింత చదవండి :