విద్యాబాలన్‌, దీపికా పదుకునెలతో "విప్రనారాయణ"

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Updated: గురువారం, 1 అక్టోబరు 2015 (16:49 IST)
ా|| అక్కినేని నాగేశ్వరరావు, డా||భానుమతి 1954లో నటించిన చిత్రం 'విప్ర నారాయణ'. ఇది ఎంతో సంచలాన్ని సృష్టించింది. ఇటువంటి చిత్రాన్ని ప్రస్తుతం గోపీచంద్‌, నయనతారతో జైబాలాజీ రియల్‌ మీడియా అధినేత తాండ్ర రమేష్‌, కొమర వెంకటేష్‌తో కలిసి మళ్ళీ నిర్మిస్తున్నారు.

ఆ రోజుల్లో అన్ని తరగతులవారు మెచ్చిన యీ చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక విలువల్ని జోడించి తీయనున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హిందీలో ప్రముఖ హీరో నటించనున్న ఈ చిత్రానికి కథానాయికగా విద్యాబాలన్‌, దీపికా పదుకునేతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.


దీనిపై మరింత చదవండి :