సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు U సర్టిఫికెట్... 3 రోజుల ముందే సంక్రాంతి... మహేష్

Mahesh babu on SVSC censor
Venkateswara Rao. I|
WD
విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ అన్నదమ్ములుగా నటిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సార్ పూర్తయి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. సూపర్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి అనిత సమర్పణలో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ - ''శ్రీకాంత్‌ చెప్పిన సబ్జెక్ట్‌ విని ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఈ సినిమా చేయడం మంచి అనుభూతిని కలిగించింది. మూడు రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చినంత ఆనందం అభిమానుల్లో కనిపిస్తోంది. అన్నివిధాలా సంతృప్తిని కలిగించిన సినిమా ఇది. వెంకటేష్‌గారితో ఇంత మంచి సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగించింది'' అన్నారు.


దీనిపై మరింత చదవండి :