ఉత్తమ హాస్య నటుడికి ఫోర్ట్ కారు బహుమతి

Venkateswara Rao. I|
తెలుగు సినిమా హాస్యనటులు ఈనెల 12న ప్రత్యేక అవార్డులందుకోబోతున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఏవీఎస్ చెపుతూ.. "కామెడీ ఫిలిమ్ అవార్డ్స్ 2010- వినోద్ బాల, నేను కలిసి చేసిన ఆలోచన. లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ సహా రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, జంధ్యాల పేర్లతో అవార్డులు ప్రకటిస్తారు.

హైదరాబాద్ నోవా టెల్‌లో ఆదివారం( ఈ నెల 12) సాయంత్రం వేడుక జరుగుతుంది. 20 క్యాటగిరీల్లో అవార్డులుంటాయి. రేలంగి నరసింహారావు, దివాకర్ బాబు సారథ్యంలో కమిటీ అవార్డులందిస్తుంది. అవార్డు విజేతకు ఒక ఫోర్డ్ ఫిగో కారును కానుకగా దక్కుతుంది. ముఖ్యమంత్రి రోశయ్య, గీతారెడ్డి, చిరంజీవి సహా పరిశ్రమ కళాకారులు, ప్రముఖుల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది" అన్నారు.


దీనిపై మరింత చదవండి :