16న "16డేస్" ఆడియో విడుదల

FILE
ఛార్మీ, అరవింద్ జంటగా ప్రభుసాల్మన్ దర్శకత్వంలో కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వై.చౌదరి, పి. మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం "16 డేస్". తమిళంలో "లాడం" పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో మార్కెట్లోకి విడుదల కాగా, తెలుగు వెర్షన్ ఈ నెల 16వతేదీన రిలీజ్ కానుంది.

సోనీ బిఎంజి ఆడియో ద్వారా 16 డేస్ ఆడియో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, తమిళ నేపథ్యమయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

Harsha Vardhan|
చనిపోయిన తర్వాత ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కార్యక్రమాలు జరుపుతారని, అలా ఈ కార్యక్రమం లోపల ఓ సంఘటన జరుగుతుందని... అది ఏమిటి? అనేదే చిత్రంలోని పాయింట్ అని ప్రభు సాల్మన్ చెప్పారు.


దీనిపై మరింత చదవండి :