శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2014 (18:54 IST)

ఇష్టం లేకపోతే చూడొద్దన్న సుప్రీం: లాంగ్ కిస్.. టేప్ రికార్డ్ లేకుండా..!?

అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' సినిమా పోస్టర్ల స్థాయిలోనే దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఫస్ట్ పోస్టరే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. వాటిపై దేశవ్యాప్తంగా దుమారం రేగడం, దానిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించడం తెలిసిందే. ఇంకా పోస్టర్లు.. సినిమాలోని కొన్ని హాట్ సన్నివేశాలు సంచలనం సృష్టించక తప్పవని టాక్ వస్తోంది. 
 
కాగా పీకే యూనిట్ మరింత రెచ్చిపోయింది. త్వరలోనే రెండో విడత పోస్టర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదటి అంచె పోస్టర్లలో అడ్డుగా టేప్ రికార్డరయినా ఉంటుంది, ఈసారి విడుదల చేసే పోస్టర్లలో అది కూడా ఉండదట. 
 
అమీర్ ఖానే స్వయంగా ఈ విషయం చెప్పాడు. ఆగస్టు 20న రానున్నాయట ఈ కొత్త పోస్టర్లు. 'మై మరాఠి' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఈ విషయాలు పంచుకున్నాడు. 'పీకే' చిత్రంలో తాను భోజ్ పురి భాష మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తానని తెలిపాడు. ఆ యాస సరిగా పలికేందుకు రెండేళ్ళ పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించాడీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.
 
అమీర్‌ఖాన్‌ నటించిన ''పి.కె'' సినిమాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'పి.కె' సినిమాలో నగ్నత్వం ప్రదర్శించారని అమీర్‌ఖాన్‌, దర్శకుడిపై సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కళలు, వినోదానికి సంబంధించిన విషయాలపై జోక్యం అవసరంలేదని పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
అలాగే ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్‌కి సలహా ఇచ్చింది. అంతేకాకుండా ఇటువంటి విషయాలలో,మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీ కోర్టు పిటీషనర్‌కి సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది. 
 
మరోవైపు 'పీకే'లో తన కొత్త గెటప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అభిమానుల అభిప్రాయాలను అమీర్ ఖాన్ కోరుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు. 
 
‘పీకే' సినిమా విషయానికొస్తే.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్‌లో కనిపించనున్నాడు. 
 
అలాగే అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. 
 
బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్‌ ఇదే అని అంటున్నారు. మొత్తానికి అమీర్ ఖాన్‌కు ఏమైందో ఏమో కానీ పీకే సినిమాలో ఏదో కొత్త రికార్డుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.